కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
న్యూఢిల్లీ: కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏటికేడు టీవీ వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచుకుంటోంది. తాజాగా ముగిసిన నాలుగో సీజన్ కబడ్డీ లీగ్‌ను సగటున కోటి మంది వీక్షించినట్లు అంచనా. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ -1 నుంచి సీజన్-4 ముగిసే సరికి వీక్షకుల సంఖ్య 51 శాతం పెరిగింది. పురుషులతో పాటు మహిళా కబడ్డీకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు అక్టోబర్‌లో కబడ్డీ ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 12 దేశాలు తలపడతాయి. ‘ పురుషుల, మహిళల కబడ్డీకి భారత్‌లో గొప్ప ఆదరణ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ప్రేక్షకాదరణతో స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఏటికేడు స్పాన్సర్‌షిప్ పెరుగుతుండటం సంతోషకరం’ అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా అన్నారు.