డుమినీ సరికొత్త రికార్డు | JP Duminy Smokes 37 Runs In A Single Over, Creates New Record | Sakshi
Sakshi News home page

డుమినీ సరికొత్త రికార్డు

Jan 20 2018 11:46 AM | Updated on Jan 20 2018 11:46 AM

JP Duminy Smokes 37 Runs In A Single Over, Creates New Record - Sakshi

న్యూలాండ్స్‌: గత కొన్ని నెలల క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినీ కొత్త రికార్డు సృష్టించాడు. లిస్ట్‌ ' ఎ' క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. బుధవారం జరిగిన మొమెంటమ్‌ వన్డే కప్‌లో భాగంగా నైట్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో కేప్‌ కోబ్రాస్‌ కు సారథిగా వ్యవహరిస్తున్నడుమిని 6, 6, 6, 6, 2, 5 (నోబాల్‌), 6 పరుగులతో చెలరేగి ఆడాడు.

స్పిన్నర్‌ ఎడ్డీ లీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రెండు పరుగులు తీసిన డుమినీ.. నోబాల్‌కు బౌండరీ సాధించాడు. ఒక చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఫలితంగా లిస్ట్‌ 'ఎ' క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక లిస్ట్‌ 'ఎ'  క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో చిగుంబుర (జింబాబ్వే) అత్యధికంగా 39 పరుగులు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోబ్రాస్‌ ఘన విజయం సాధించింది. డుమిని(70 నాటౌట్‌; 37 బంతుల్లో) చెలరేగి ఆడి జట్టుకు  అద్భుతమైన విజయాన్ని అందించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement