జీతూ రాయ్‌కు రజతం | Jeetu Roy wind silver | Sakshi
Sakshi News home page

జీతూ రాయ్‌కు రజతం

Jun 26 2016 12:17 AM | Updated on Sep 4 2017 3:23 AM

జీతూ రాయ్‌కు రజతం

జీతూ రాయ్‌కు రజతం

రియో ఒలింపిక్స్ ముందు భారత ‘పిస్టల్ కింగ్’ జీతూ రాయ్ రజతంతో మెరిశాడు. శనివారం ఇక్కడ జరిగిన...

షూటింగ్ వరల్డ్ కప్

బాకు (అజర్‌బైజాన్): రియో ఒలింపిక్స్ ముందు భారత ‘పిస్టల్ కింగ్’ జీతూ రాయ్ రజతంతో మెరిశాడు. శనివారం ఇక్కడ జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ 199.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 200 పాయింట్లతో ఫిలిప్ అల్మిడా (బ్రెజిల్) స్వర్ణాన్ని సాధించగా, మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన జంగో జిన్ (కొరియా) 178.8 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా రాయ్‌కి ఇది ఆరో ప్రపంచ కప్ పతకం కాగా... ఈ సీజన్‌లో రెండోది. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధూ (582 పాయింట్లు) ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement