వీడియో గేమ్లా ఉంది: సెహ్వాగ్ | Sakshi
Sakshi News home page

వీడియో గేమ్లా ఉంది: సెహ్వాగ్

Published Sun, Aug 28 2016 12:59 PM

వీడియో గేమ్లా ఉంది: సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఎప్పుడూ విన్నూత్న శైలిలో ట్వీట్లు చేస్తూ ఆకట్టుకునే భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అమెరికాలో భారత-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను వీడియో గేమ్తో పోల్చుతూ మరో ఆఫ్ బీట్ ట్వీట్ చేశాడు. అసలు టీ 20 క్రికెట్ అంటేనే పూర్తి మజాను అందించే గేమ్ అని, అయితే రెండు చాంపియన్ జట్ల మధ్య జరిగిన తాజా మ్యాచ్ మాత్రం మనం ఇంట్లో కూర్చుని వీడియో గేమ్ను ఆడినట్లే ఉందంటూ చమత్కరించాడు. ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ టీ 20 క్రికెట్లో అత్యధిక పరుగులు నమోదు కావడం ఈ ఫార్మాట్ స్థాయిని మరింత పెంచిందన్నాడు.

దీంతో పాటు 325 మ్యాచ్లకు కెప్టెన్ గా చేసి మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడంటూ సెహ్వాగ్ కొనియాడాడు. మరోవైపు భారత తరపున టీ 20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కేఎల్ రాహుల్ ను సైతం సెహ్వాగ్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిసి నమోదు చేసిన స్కోరు 489. ఇది ఓవరాల్ టీ 20 చరిత్రలో అత్యధిక సంయుక్త స్కోరు. అంతకుముందు 2010లో జరిగిన ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్-రాజస్థాన్ రాయల్స్ కలిపి నమోదు సాధించిన స్కోరే (469) ఇప్పటివరకూ అత్యధికం. మరోవైపు అంతర్జాతీయ టి20ల్లో రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు(244) చేసిన జట్టుగా భారత్ నిలిచింది.
 

 
Advertisement
 
Advertisement