‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’ | It's a life changing amount of money: Stokes on IPL Auction | Sakshi
Sakshi News home page

‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’

Feb 21 2017 12:16 PM | Updated on Sep 5 2017 4:16 AM

‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’

‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’

ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అమితాసక్తి కనబరిచాడు.

బెంగళూరు: ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అమితాసక్తి కనబరిచాడు. బెంగళూరులో జరిగిన వేలంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెల్లవారుజామునే మేల్కొన్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్నే మార్చేసే ధర దక్కిందని వ్యాఖ్యానించాడు.

‘ వేలంపాటను ప్రత్యక్షంగా చూడాలని అలారం పెట్టుకుని తెల్లజామున 3.30 గంటలకు నిద్రలేచాను. వేలంలో నా వంతు వచ్చే వరకు 40 నిమిషాలు వేచి చూశాను. అలా ఉత్సాహంగా ఎదురు చూశాను. నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేదు. ట్విటర్ ను ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ట్విటర్ లో రీప్రెష్ కొడుతూనే ఉన్నాను. నెటిజన్లు పెట్టిన ట్వీట్లు చూసి పుణే నన్ను దక్కించుకుందని తెలుసుకున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర. నాకు మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా నా జీవితంలో అన్ని మంచి విషయాలు వింటున్నాను. ముఖ్యంగా ఈ వారం నాకు బాగా కలిసొచ్చింద’ని స్టోక్స్‌ అన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్‌ రికార్డు సృష్టించాడు. సోమరవారం బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్‌-10 వేలంలో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement