న్యూజిలాండ్ జోరు | Irish women beaten by New Zealand in Twenty20 World Cup opener | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ జోరు

Mar 26 2014 12:43 AM | Updated on Oct 17 2018 4:43 PM

మహిళల టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ లో న్యూజిలాండ్ హవా కొనసాగిస్తూ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది.

ఐర్లాండ్‌పై 42 పరుగులతో గెలుపు
 టి20 మహిళల ప్రపంచకప్
 
 సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ లో న్యూజిలాండ్ హవా కొనసాగిస్తూ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 171 పరుగులు చేసింది.
 
 ఓపెనర్లు సుజీ బేట్స్ (51 బంతుల్లో 68; 10 ఫోర్లు), ఫ్రాన్సెస్ మెక్ కే (49 బంతుల్లో 51; 6 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌ఉమన్ మెక్ గ్లాషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించి కివీస్‌కు భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది.  
 
 ఆసీస్ బోణి
 గ్రూప్ ‘ఎ’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై అలవోకగా నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు హంటర్ (2/13), ఫార్రెల్ (2/19), ఓస్బార్న్ (2/20) దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. అనంతరం ఆసీస్ 18.4  ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. ఎలీస్ పెర్రీ (41 నాటౌట్), జెస్ కెమెరాన్ (27 నాటౌట్) రాణించారు. బుధవారం జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement