వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్ టి20 ప్రపంచ కప్ ప్రధాన టోర్నీకి మరింత చేరువైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఐర్లాండ్ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది.
సిల్హెట్: వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్ టి20 ప్రపంచ కప్ ప్రధాన టోర్నీకి మరింత చేరువైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఐర్లాండ్ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. సిల్హెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులు చేసింది.
అన్వర్ (30), అంజద్ అలీ (20), జావేద్ (19) రాణించారు. స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రియాన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 14.2 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో డక్‌వర్త్ విధానంలో విజేతను నిర్ణయించారు. ఎడ్ జాయస్ (43), పోర్టర్‌ఫీల్డ్ (33 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు. అసదుల్లా 2 వికెట్లు పడగొట్టాడు. జాయస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
గ్రూప్ ‘ఎ’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
అఫ్ఘానిస్థాన్ x నేపాల్
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
బంగ్లాదేశ్ x హాంకాంగ్
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం