ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ 171 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్కు నిర్దేశించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ 171 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్కు నిర్దేశించింది. సోమవారమిక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (30), కరుణ్ నాయర్ (44) జట్టుకు శుభారంభం అందించారు. సంజు శామ్సన్ (37), షేన్ వాట్సన్ (31) ఇదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. కోల్కతా బౌలర్లు సునీల్ నరైన్, వినయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు.