
అదే విధ్వంసం.. అదే ఫలితం
బౌలర్ ఎవరైనా... ఫీల్డర్లు ఎంత మంది ఉన్నా... బంతి బ్యాట్‌ను తగిలితే బౌండరీ దాటాల్సిందే.. టి20ల్లో పరుగులు రాబట్టాలంటే ఏ బ్యాట్స్‌మన్ అయినా ఈ పద్ధతిని కచ్చితంగా అమలు చేస్తారు.
మ్యాక్స్‌వెల్ మరో సంచలన ఇన్నింగ్స్
పంజాబ్‌కు ‘హ్యాట్రిక్’ విజయం
72 పరుగులతో ఓడిన సన్‌రైజర్స్
గత రెండు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్... ఈసారి టార్గెట్ నిర్దేశించడంలోనూ తన సత్తా చాటాడు. సునామీని తలపిస్తూ బ్యాటింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. మ్యాక్స్ దెబ్బకు ‘సన్’ బౌలర్లు చిన్నబోయారు. టోర్నీలో తొలిసారి పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో... కింగ్స్ ముచ్చటగా మూడో విజయాన్ని అందుకుంది.
షార్జా: బౌలర్ ఎవరైనా... ఫీల్డర్లు ఎంత మంది ఉన్నా... బంతి బ్యాట్‌ను తగిలితే బౌండరీ దాటాల్సిందే.. టి20ల్లో పరుగులు రాబట్టాలంటే ఏ బ్యాట్స్‌మన్ అయినా ఈ పద్ధతిని కచ్చితంగా అమలు చేస్తారు. గత రెండు మ్యాచ్‌ల్లో అలాంటి ఆటతీరునే ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్... సన్‌రైజర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ సునామీని మించిన విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేసినా మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. సెహ్వాగ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), పుజారా (32 బంతుల్లో 35; 6 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు.
11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వార్నర్ సులభమైన క్యాచ్ వదిలేయడంతో ఊపిరిపీల్చుకున్న మ్యాక్స్‌వెల్... ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భువనేశ్వర్ 3, మిశ్రా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో స్టెయిన్, భువనేశ్వర్‌లతో బౌలింగ్ చేయించకపోవడం ఆశ్చర్యపరిచింది. తర్వాత సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లోకేష్ రాహుల్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఫించ్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. బాలాజీ 4, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా (సి) వేణుగోపాల్ రావు (బి) స్యామీ 35; సెహ్వాగ్ (సి) స్యామీ (బి) మిశ్రా 30; మ్యాక్స్‌వెల్ (సి) స్యామీ (బి) మిశ్రా 95; మిల్లర్ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 10; బెయిలీ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 10; జాన్సన్ (బి) భువనేశ్వర్ 4; అక్షర్ పటేల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193.
వికెట్ల పతనం: 1-51; 2-86; 3-154; 4-179; 5-189; 6-193
బౌలింగ్: స్టెయిన్ 4-0-26-0; భువనేశ్వర్ 4-0-19-3; ఇర్ఫాన్ 2-0-28-0; కరణ్ శర్మ 4-0-37-0; మిశ్రా 4-0-56-2; స్యామీ 2-0-22-1
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) బాలాజీ 19; ధావన్ (సి) సాహా (బి) జాన్సన్ 1; వార్నర్ (బి) మాక్స్‌వెల్ (బి) బాలాజీ 8; రాహుల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ పటేల్ 27; వేణుగోపాల్ రావు (బి) సందీప్ 11; ఇర్ఫాన్ (బి) అక్షర్ పటేల్ 5; స్యామీ (సి) పటేల్ (బి) బాలాజీ 15; కరణ్ శర్మ (సి) మిల్లర్ (బి) జాన్సన్ 10; స్టెయిన్ (బి) బాలాజీ 12; మిశ్రా నాటౌట్ 4; భువనేశ్వర్ (సి) జాన్సన్ (బి) ధావన్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్) 121.
వికెట్ల పతనం: 1-11; 2-31; 3-33; 4-49; 5-74; 6-93; 7-95; 8-114; 9-118; 10-121
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-26-1; జాన్సన్ 4-0-26-2; బాలాజీ 4-0-13-4; రిషీ ధావన్ 2.2-0-23-1; అక్షర్ పటేల్ 4-0-20-2; మాక్స్‌వెల్ 1-0-10-0.