ఐపీఎల్-7: చెన్నై ఐదు వికెట్లతో రాజస్థాన్పై విజయం | IPL-7: Chennai beats Rajasthan by 5 wickets | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: చెన్నై ఐదు వికెట్లతో రాజస్థాన్పై విజయం

May 13 2014 7:26 PM | Updated on Sep 2 2017 7:19 AM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లతో విజయం సాధించింది.

రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్లో 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. డ్వెన్ స్మిత్ (44), డుప్లెసిస్ (38) రాణించారు. చివర్లో ధోనీ , జడేజా జట్టును గెలిపించారు.

అంతుకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (36 బంతుల్లో 51) మెరుపు హాప్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ అంకిత్ శర్మ (30)తో కలసి 60 పరుగుల భాగస్వామంతో జట్టుకు శుభారంభం అందించాడు. కాగా వీరిద్దరూ అవుటయ్యాక రాజస్థాన్ జోరు కాస్త తగ్గింది. చివర్లో స్టువర్ట్ బిన్నీ (22) రాణించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలయ్యారు. చెన్నయ్ బౌలర్లు మోహిత్ శర్మ మూడు, రవీంద్ర జడేజా రెండు   రెండేసి వికెట్లు తీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement