ఐపీఎల్‌-12 విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు

IPL 2019 Final Match Greenstone Lobo Predicts The Winner - Sakshi

హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌ 12 తుది దశకు చేరుకుంది. నేడు స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో ప్రముఖ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో అంచనావేశారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం 2013,2015 సీజన్ల మాదిరిగానే రానుందని తెలిపారు. ఆ సీజన్లలో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టే ఈ సారి చాంపియన్‌గా అవతరించే అవకాశాలున్నాయని ఆ జ్యోతిష్కుడు అంచనా వేశారు. 

రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, దీంతో కప్‌ ముంబై జట్టే ఎగరేసుకపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్‌ ప్రారంభంలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈ సారి కూడా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉండటం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఫిఫా ప్రపంచకప్‌ 2018 విజేత విషయంలోనూ ఈ జ్యోతిష్కుడి అంచనాలు బాగానే పనిచేశాయి. దీంతో ఈ సారి కప్‌ తమదేనని ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇదంతా ట్రాష్‌ అని కొట్టిపారేస్తున్నారు. దీంతో జ్యోతిష్కుడు చెప్పినట్లు ముంబై గెలుస్తుందా లేక అతడి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్‌కే గెలుస్తుందా అనేది వేచి చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top