breaking news
Greenstone Lobo
-
ఐపీఎల్-12 విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు
హైదరాబాద్ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ సీజన్ 12 తుది దశకు చేరుకుంది. నేడు స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టైటిల్ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో ప్రముఖ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో అంచనావేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫలితం 2013,2015 సీజన్ల మాదిరిగానే రానుందని తెలిపారు. ఆ సీజన్లలో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టే ఈ సారి చాంపియన్‌గా అవతరించే అవకాశాలున్నాయని ఆ జ్యోతిష్కుడు అంచనా వేశారు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, దీంతో కప్ ముంబై జట్టే ఎగరేసుకపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్ ప్రారంభంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉండటం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఫిఫా ప్రపంచకప్ 2018 విజేత విషయంలోనూ ఈ జ్యోతిష్కుడి అంచనాలు బాగానే పనిచేశాయి. దీంతో ఈ సారి కప్ తమదేనని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. దీంతో జ్యోతిష్కుడు చెప్పినట్లు ముంబై గెలుస్తుందా లేక అతడి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్కే గెలుస్తుందా అనేది వేచి చూడాలి. -
ఐపీఎల్ 11 విజేత ఎవరంటే..!
ముంబై: ఇంకా ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం అవకముందే విజేత ఎవరో ఎలా తెలుస్తుందంటారా.. ప్రతి టోర్నీ, ఈవెంట్ల ప్రారంభంలో జట్ల బలబలాలు, విజయావకాశాలపై కొన్ని అంచనాలు ఉండటం సహజం. ఈ క్రమంలో ఈ సీజన్లో విజేత అయ్యేందుకు జట్లకు ఉన్న అవకాశాలపై ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పాడు. 1981లో పుట్టిన కెప్టెన్లు గౌతం గంభీర్, ఎంఎస్ ధోనిలు మరోసారి ట్రోఫీ నెగ్గే అవకాశం లేదన్నాడు. అంటే ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నెగ్గవని చెప్పినట్లు. అనుభవం ఉన్న కెప్టెన్లను ఈ సీజన్లో దూరం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ట్రోఫీ నెగ్గేలా కనిపించడం లేదు. గ్రీన్‌స్టోన్ లోబో లెక్క ప్రకారం ఐపీఎల్ 11 రేసులో ఇక మిగిలిన నాలుగు జట్లు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ నాలుగు జట్ల పోటీ ఎక్కువగా ఉన్నా ఇందులో రెండు జట్లను మాత్రం అదృష్టం వరిస్తుందన్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలో వరుసగా రెండోసారి ముంబై ట్రోఫీ నెగ్గదని, గంభీర్ స్థానంలో కోల్‌కతా కెప్టెన్‌గా వచ్చిన దినేశ్ కార్తీక్ వీక్ కెప్టెన్‌గా కనిపించడం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక రేసులో మిగిలింది పంజాబ్, బెంగళూరు జట్లు. జ్యోతిష్యం ప్రకారం చూసినా, అనుభవం పరంగా, ఆటపట్ల అంకిత భావం చూసినా విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వీరి ఆటకు గ్రహబలం తోడవుతుందని.. దీంతో బెంగళూరు లేక పంజాబ్ జట్లలో ఓ జట్లు ఐపీఎల్ 11వ సీజన్‌ను కైవసం చేసుకుంటుందని జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నాడు. అయితే విజేతగా నిలిచి ఏ జట్టు ట్రోఫీ నెగ్గుతుందో తెలియాలంటే 27 మే వరకు వేచిచూడాల్సిందే. గ్రీన్‌స్టోన్ లోబో (ఫైల్ ఫొటో)