ధోని రనౌట్‌పై స్పందించిన భజ్జీ

IPL 2019 Final Harbhajan on Dhoni Run Out Against Mumbai - Sakshi

ఫైనల్‌ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ నిర్ణయంపై అభిమానుల ఫైర్‌

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హర్భజన్‌

చెన్నై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే సారథి ధోని రనౌట్‌ నిర్ణయం వివాదస్పదమైంది. ధోని రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయి.. ముంబై ఇండియన్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్‌ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్‌కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయం ప్రకటించకుండా వ్యతిరేకంగా ప్రకటించారని సీఎస్‌కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీంతో ధోని రనౌట్‌ నిర్ణయంపై ఇంకా రగులుతూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘మరోసారి ఐపీఎల్‌లో చెత్త నిర్ణయం..థర్డ్‌ అంపైర్‌ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్‌గా ప్రకటించాడు’ అని కొందరు అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎస్‌కే స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. 

‘ఫైనల్‌ మ్యాచ్‌లో మేము తప్పిదాలు చేసిన మాట వాస్తవం. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. ముంబై జట్టులో జస్ప్రిత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ప్రపంచకప్‌లో బుమ్రా ప్రధానమవుతాడు. కీలక సమయంలో ధోని రనౌట్‌ కావడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. అయితే బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నాటౌట్‌గా ప్రకటించాల్సింది కానీ అది జరగేలేదు. సీఎస్‌కేకు వ్యతిరేకంగా అంపైర్‌ నిర్ణయం ప్రకటించాడు. ఇది చాలా కఠిన నిర్ణయం. వాట్సన్‌ పోరాటం ఆకట్టుకుంది.’అంటూ భజ్జీ పేర్కొన్నాడు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
వివాదస్పదమైన ధోని రనౌట్‌ నిర్ణయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top