సచిన్.. అంబాసిడర్గా వ్యవహరించండి | IOA approaches Sachin Tendulkar to be Rio Olympics Brand Ambassador | Sakshi
Sakshi News home page

సచిన్.. అంబాసిడర్గా వ్యవహరించండి

Apr 29 2016 12:20 PM | Updated on Sep 3 2017 11:03 PM

సచిన్.. అంబాసిడర్గా వ్యవహరించండి

సచిన్.. అంబాసిడర్గా వ్యవహరించండి

రియో ఒలింపిక్స్కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. ఐఓఏ ఈ మేరకు సచిన్కు లేఖ రాసింది. ఐఓఏ అభ్యర్థనపై సచిన్ ఇంకా స్పందించాల్సివుంది.

బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ వ్యవహరించడం వల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ను కూడా రియో బృందం చేర్చాలని ఐఓఏ భావిస్తోంది. ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు భారత జట్టుకు గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ నియామకంపై కొందరు క్రీడా దిగ్గజాలు విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement