దూసుకెళ్తున్న భారత షూటర్లు | Indian shooters add another bronze in shooters add another bronze | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న భారత షూటర్లు

Sep 22 2014 5:52 PM | Updated on Sep 2 2017 1:48 PM

భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ

భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ

17వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు బుల్లెట్ మీద బుల్లెట్ దించుతున్నారు.

ఇంచియాన్: 17వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు బుల్లెట్ మీద బుల్లెట్ దించుతున్నారు. గురి తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా మరో కాంస్య పతకం సాధించి ఈ విభాగంలో గెల్చుకున్న మెడల్స్ సంఖ్య నాలుగు పెంచారు. మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో భాతర షూటర్లు హీనా సిద్ధూ, అనీషా సయ్యద్, రహీ సర్నోబాట్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు.

ఇండియాకు నాలుగో రోజు రెండు పతకాలు దక్కాయి. స్వ్కాష్ లో దిపికా పల్లికల్ కాంస్యం గెల్చుకుంది. మొత్తం ఆరు పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ 13వ స్థానంలో నిలిచింది. స్వ్కాష్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి సౌరవ్ గోషల్ మరో పతకం ఖాయం చేశాడు. ఫైనల్లో ఓడిపోయినా అతడికి సిల్వర్ మెడల్ ఖాయం.

Advertisement
 
Advertisement
Advertisement