ఏషియన్‌ గేమ్స్‌: అదరగొట్టిన భారత హాకీ జట్టు

Indian Hockey Team Wins Against Hong Kong In Asian Games - Sakshi

జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్‌ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌26-0తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్‌ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్‌ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్‌ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్‌ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది. 

భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్‌తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్‌చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్‌లో కూడా భారత్‌17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top