ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

Indian Army responds to Dhonis request of training with Parachute regiment - Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.  విండీస్‌ పర్యటన నుండి స్వయంగా తప్పుకున్న ధోని.. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో  రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా ఆర్మీలో పని చేయడానికి ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌.. ధోని దరఖాస్తుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం తెలిసింది. ప్యారాచూట్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top