చీరకు చెల్లుచీటీ...

India women athletes will wear blazers and trousers - Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభోత్సవంలో తొలిసారి

బ్లేజర్, ట్రౌజర్స్‌ ధరించనున్న భారత మహిళా అథ్లెట్లు

న్యూఢిల్లీ: సంప్రదాయానికంటే మహిళా అథ్లెట్ల సౌకర్యానికే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) జై కొట్టింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో ఏప్రిల్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలో భారత బృందంలోని మహిళలు చీరలకు బదులు బ్లేజర్స్, ట్రౌజర్స్‌ను ధరించేందుకు ఐఓఏ అనుమతించింది. క్రీడాకారిణులు బ్లేజర్స్, ట్రౌజర్స్‌ ధరించి మార్చ్‌పాస్ట్‌ చేస్తారని ఐఓఏ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత ఒలింపిక్‌ సంఘం నిర్ణయాన్ని ఐఓఏ అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ మాలవ్‌ ష్రాఫ్‌ స్వాగతించారు. కొత్త వస్త్రధారణ అమ్మాయిలకు సహజంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆరంభోత్సవం ఏప్రిల్‌ 4న కెర్రరా స్టేడియంలో జరుగనుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top