
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగునున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో టాస్ వేయడానికి మరింత ఆలస్యం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం చేత ఆటకు అంతరాయ ఏర్పడింది. అయితే తొలుత కాస్త తెరుపు ఇవ్వడంతో టాస్‌ను గం. 3.00ని.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
(ఇక్కడ చదవండి: ‘వరల్డ్‌కప్ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా’)