
మౌంట్ మాంగనీ: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు లోకేష్ రాహుల్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో సెంచరీ సాధించాడు. 104 బంతులు ఎదుర్కొన్న రాహుల్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతనికిది నాలుగో సెంచరీ కావడం విశేషం. కోహ్లి ఔటైన అనంతర క్రీజులోకొచ్చిన రాహుల్ తొలుత శ్రేయాస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 4) తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అనంతరం పాండేతో కలిసి 100 పరుగుల పార్టనర్‌షిప్‌ను నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. 45 ఓవర్లు పూర్తయ్యే సరికి జట్టు స్కోరు నాలుగు వికెట్లకు 254 పరుగులు కాగా.. రాహుల్ 102, మనీష్ పాండే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.