డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌

India Vs Bangladesh 1st Test Mayank Agarwal Hits Double Century - Sakshi

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు టీమిండియా ఫస్ట్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా మూడో సెషన్‌ సమయానికి 282 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. జట్టు స్కోరు 432 వద్ద అగర్వాల్ (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర  జడేజా (66 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా (5 బం‍తుల్లో 6) క్రీజులో ఉన్నారు. టెస్టుల్లో మాయంక్‌కు ఇది రెండో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మాదిరిగా.. రెండో డబుల్‌ సెంచరీ సాధించే సమయంలో 196 పరుగుల వద్ద మయాంక్‌ సిక్స్‌ కొట్టడం మరో విశేషం.
(చదవండి : మయాంక్‌ మళ్లీ బాదేశాడు..)

ఇక ఈ ద్విశతకంతో మయాంక్‌ పలు రికార్డులను తిరగరాశాడు. లెజెండరీ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌, లారన్స్‌ రోయి, వినోద్‌ కాంబ్లీ రికార్డులను అతను తుడిచిపెట్టాడు. కాంబ్లీ 5 ఇన్సింగ్స్‌లలో డబుల్‌ సెంచరీ సాధించగా.. మయాంక్‌ 12 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. బ్రాడ్‌మన్‌ 13 ఇన్సింగ్స్‌లు, లారన్స్‌ రోయి 14 ఇన్సింగ్స్‌లలో ద్విశతకాలు సాధించారు. ఇక భారత్‌ తరపున టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన ఐదో ఓపెనర్‌గా మయాంక్‌ నిలిచాడు. అంతకుముందు సునీల్‌ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వినోద్‌ మన్కడ్‌, వసీం జాఫర్‌ ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top