అంపైర్ కులకర్ణిపై అసంతృప్తి! | India to lodge official complaint against umpire Kulkarni | Sakshi
Sakshi News home page

అంపైర్ కులకర్ణిపై అసంతృప్తి!

Oct 14 2015 1:09 AM | Updated on Sep 3 2017 10:54 AM

అంపైర్ కులకర్ణిపై అసంతృప్తి!

అంపైర్ కులకర్ణిపై అసంతృప్తి!

తొలి టి20లో భువనేశ్వర్ బౌలింగ్‌లో డుమిని అవుట్ నిరాకరణ... మొదటి వన్డేలో మోర్కెల్ బౌలింగ్‌లో ధావన్ అవుట్...

ఇండోర్: తొలి టి20లో భువనేశ్వర్ బౌలింగ్‌లో డుమిని అవుట్ నిరాకరణ... మొదటి వన్డేలో మోర్కెల్ బౌలింగ్‌లో ధావన్ అవుట్... ఈ రెండు నిర్ణయాల్లోనూ అంపైర్ వినీత్ కులకర్ణి పనితీరుపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టి20లో డుమిని ఆ క్షణంలో అవుటైతే ఫలితంగా భిన్నంగా ఉండేదని కెప్టెన్ ధోని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కులకర్ణిపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ‘అంపైరింగ్ బాగా లేదని అందరికీ అర్థమవుతోంది. అందుకే నేను అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నా. సిరీస్ చివర్లో ఇచ్చే నా నివేదికలో మా కెప్టెన్ విమర్శలు కూడా చేరుస్తాను’ అని జట్టు మేనేజర్ వినోద్ ఫడ్కే వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement