శ్రీలంకకు స్వల్ప లక్ష్యం | india set target of 102 runs for srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు స్వల్ప లక్ష్యం

Feb 9 2016 9:00 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకకు స్వల్ప లక్ష్యం - Sakshi

శ్రీలంకకు స్వల్ప లక్ష్యం

మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 102 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.

పుణె:మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 102 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన వరుస వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(0), శిఖర్ ధావన్(9), అజింక్యా రహానే(4), సురేష్ రైనా(20), యువరాజ్ సింగ్(10), మహేంద్ర సింగ్ ధోని(2), హార్దిక్ పాండ్యా(2),  రవీంద్ర జడేజా(6)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఏ ఒక్క ఆటగాడు క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించకుండానే క్యూకట్టారు.

 

తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. ఐదో ఓవర్ చివరి బంతికి మూడో వికెట్ ను నష్టపోయింది. తరువాత తొమ్మిదో ఓవర్ రెండు బంతికి నాల్గో వికెట్,  తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి ఐదో వికెట్ ను టీమిండియా నష్టపోయి కష్టాల్లో పడింది. ఓ దశలో 58 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ ను అశ్విన్(31 నాటౌట్) ఆదుకున్నాడు. చివరి వరుస ఆటగాళ్లతో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో టీమిండియా వంద పరుగులను దాటకల్గింది. కాగా,ఆఖర్లో నెహ్రా, బూమ్రాల అవుట్ కావడంతో టీమిండియా 18.5 ఓవర్ లో 101పరుగులకే ఆలౌటయ్యింది.


ఇదిలాఉంటే యువకులతో నిండిన శ్రీలంక ఆద్యంత ఆకట్టుకుంది. టీమిండియా బ్యాటింగ్ కు ముందు తేలిపోతారనుకున్న శ్రీలంక బౌలర్లు పదునైన బంతులతో శభాష్ అనింపించారు. శ్రీలంక బౌలర్లలో కాశున్ రజితా, షనాకా తలో మూడు వికెట్లు సాధించగా,చమీరాకు రెండు, సేననాయకేకు ఒక వికెట్ దక్కింది.

మ్యాచ్ విశేషాలు..


*ట్వంటీ20ల్లో పది ఓవర్లలో ఆరు వికెట్లను చేజార్చుకోవడం భారత్ కు ఇది మూడోసారి. అంతకుముందు 2008-09 న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో, ఆ తరువాత 2010లో బ్రిడ్జిటౌన్లో ఆసీస్ తో మ్యాచ్ లో భారత్ 10 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయింది.



*శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితా, దాసున్ షనకాలు టీ20 కెరీర్ లో తమ తొలి ఓవర్ లో రెండేసి వికెట్లు తీయడం ఇదే తొలిసారి.


*టీ20ల్లో ఇది సురేష్ రైనాకు 50వ మ్యాచ్ కాగా, ధోనికి 56వ మ్యాచ్

*తొలి ఓవర్ లో రెండు వికెట్లను కోల్పోవడం భారత్ టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి

Advertisement
 
Advertisement
Advertisement