మెరిసిన రోహిత్‌ .. బంగ్లా లక్ష్యం 177 | Sakshi
Sakshi News home page

మెరిసిన రోహిత్‌ .. బంగ్లా లక్ష్యం 177

Published Wed, Mar 14 2018 8:47 PM

India Set To Target 177 Runs Against Bangladesh - Sakshi

కొలంబో : నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 89( 61 బంతులు, 5 ఫోర్లు 5 సిక్సులు) తన బ్యాట్‌ను ఝులిపించాడు. రోహిత్‌కు తోడు సరేశ్‌ రైనా 47(30 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో భారత్‌, బంగ్లాదేశ్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

ఇక దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తడబడుతున్న రోహిత్‌‌.. ఈ ముక్కోణపు సిరీస్‌లో సైతం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ మంచి శుభారంబాన్ని అందించారు. రోహిత్‌ నెమ్మదిగా ఆడిన ధావన్‌ తనదైన శైలిలో ఆడుతూ రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. జట్టు స్కోర్‌ 70 పరుగుల వద్ద ధావన్‌(35, 27 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సు)ను రుబెల్‌ హస్సెన్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనాతో రోహిత్‌ వేగం పెంచాడు.

ఈ దశలో రోహిత్‌ 42 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సులతో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం చెలరేగిన ఈ జోడీ  అబూహైదర్‌ వేసిన 18 ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సులతో 21 పరుగులు పిండుకున్నారు. చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రైనా బౌండరీ వద్ద సౌమ్య సర్కార్‌ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌  చేరాడు. దీంతో రోహిత్‌-రైనా 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

రుబెల్‌ హసన్‌ కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో చివరి బంతికి రోహిత్‌  పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో  చివరి ఓవర్లో కేవలం నాలుగు పరుగు మాత్రమే వచ్చాయి. దీంతో భారీ స్కోర్‌ చేస్తుందనుకున్న భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రుబెల్‌ హసన్‌కే రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
Advertisement