ఆరెంజ్‌ జెర్సీలో కోహ్లి సేన!

India Players to Wear Orange Jerseys Against England on June 30 - Sakshi

లండన్‌ : భారత క్రికెట్‌ జట్టు జెర్సీ మారనుంది. ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లిసేన.. తొలిసారి ఆరెంజ్‌ జెర్సీ ధరించనుంది. అయితే ఇది కేవలం ఇంగ్లండ్‌తో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌కు మ్రాతమే. ఈ నెల 30న జరిగే ఈ మ్యాచ్‌కు కోహ్లిసేన ఆరెంజ్‌ జెర్సీలో అభిమానులను కనువిందు చేయనుంది. దీనికి కారణం ఇంగ్లండ్‌ జట్టే. ఈ ప్రపంచకప్‌కు ఆ జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగడం.. భారత్‌ జట్టు జెర్సీ రంగు కూడా అదే కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ.. జెర్సీ రంగులు క్లాష్‌ కాకుండా ఒక్కో జట్టుకు ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం ఇచ్చింది. ‘ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనే జట్లన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. ప్రత్యామ్నాయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్చ. కానీ ఒక రంగునే టోర్నీ మొత్తం కొనసాగించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఈ విషయం ముందే తెలియజేయాలి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రపంచకప్‌ టోర్నీకి ఇంగ్లండ్‌ ఆతిథ్యమివ్వడంతో అదే జెర్సీతో బరిలోకి దిగుతుండగా భారత్‌ మాత్రం ఆరెంజ్‌ జెర్సీలో ఆడనుంది. వాస్తవానికి శనివారం జరిగే అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌కు అఫ్గాన్‌ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుండటంతో భారత్‌ యధాతథంగా బ్లూజెర్సీలో ఆడనుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యెల్లో జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు కూడా ఆయా జట్లు జెర్సీలు మార్చుకోనున్నాయి.

చదవండి : అయ్యో.. అది ఔటా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top