అరంగేట్రం రోజే.. టీమిండియా బౌలర్‌ వీడ్కోలు

India Pacer RP Singh announces Retirement from Cricket - Sakshi

లక్నో: టీమిండియా సినీయర్‌ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఈ 32 ఏళ్ల స్పీడ్‌స్టార్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘13 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్‌ 4, 2005లో తొలిసారి టీమిండియా జెర్సీ ధరించా. నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి. ఈ రోజే నా ఆటకు ముగింపు పలుకుతున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ బౌలర్ తన కెరీర్‌లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 69, టీ-20ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో ఆర్పీ సింగ్‌ సభ్యుడు. 2016లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ ఆడిన ఆర్పీ సింగ్ అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఆర్పీ సింగ్‌కు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top