న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు | India level series with 3-1 win against New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు

Oct 8 2015 2:12 AM | Updated on Sep 3 2017 10:35 AM

తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి భారత పురుషుల హాకీ జట్టు తేరుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో

 క్రైస్ట్‌చర్చ్: తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి భారత పురుషుల హాకీ జట్టు తేరుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో భారత్ 0-2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో భారత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది.13వ నిమిషంలో బీరేంద్ర లాక్రా అందించిన పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 45వ నిమిషంలో కేన్ రసెల్ గోల్‌తో న్యూజిలాండ్ స్కోరును 1-1తో సమం చేసింది. అయితే ఏడు నిమిషాల తర్వాత లలిత్ ఉపాధ్యాయ్ గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషంలో నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం ఇదే వేదికపై మూడో మ్యాచ్ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement