కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత జట్టు తొలి రోజే నాలుగు పతకాలు సాధించింది.
న్యూఢిల్లీ: కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత జట్టు తొలి రోజే నాలుగు పతకాలు సాధించింది. బహమాస్‌లోని నసావూ నగరంలో జరుగుతున్న ఈ క్రీడల్లో జూడో క్రీడాంశంలో భారత్‌కు స్వర్ణం, 3 కాంస్య పతకాలు లభించాయి. బాలుర 73 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన సోని విజేతగా నిలిచి పసిడి పతకం గెలిచాడు.
ఫైనల్లో అతను 10–0తో ఉరోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచా డు. బాలుర విభాగంలో ఆశిష్ (60 కేజీలు)... బాలికల విభాగంలో చానమ్ రెబీనా దేవి (57 కేజీలు), అంతిమ్ యాదవ్ (48 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు. ఈనెల 24న ముగిసే ఈ క్రీడల్లో జూడోలో ఒక దేశం నుంచి నలుగురికి మాత్రమే (బాలుర విభాగంలో ఇద్దరు, బాలికల విభాగంలో ఇద్దరు) అవకాశం కల్పించారు.