‘అర్జున’ రేసులో సందేశ్, బాలాదేవి  | India Football Federation Selected Sandesh And Bala Devi For Arjuna | Sakshi
Sakshi News home page

‘అర్జున’ రేసులో సందేశ్, బాలాదేవి 

May 13 2020 3:42 AM | Updated on May 13 2020 3:42 AM

India Football Federation Selected Sandesh And Bala Devi For Arjuna - Sakshi

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్‌ జట్టు తరఫున నిలకడగా రాణిస్తోన్న పురుషుల జట్టు డిఫెండర్‌ సందేశ్‌ జింగాన్‌... మహిళల జట్టు స్ట్రయికర్‌ బాలాదేవిలను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’కు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) నామినేట్‌ చేసింది. 2015లో జట్టులోకి వచ్చిన 25 ఏళ్ల చండీగఢ్‌ ప్లేయర్‌ సందేశ్‌ 36 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మణిపూర్‌కు చెందిన 30 ఏళ్ల బాలాదేవి ఇటీవల స్కాట్లాండ్‌కు చెందిన రేంజర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో 18 నెలల ఒప్పందాన్ని చేసుకుంది. తద్వారా విదేశీ ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఆడిన తొలి మహిళా భారత ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement