అవిధేయత చూపిస్తున్నావా.. మీ నుంచే నేర్చుకుంటున్నా!

Ind vs Ban: Ganguly Engages In Funny Banter With Daughter Sana - Sakshi

కోల్‌కతా: భారత్‌-బంగ్లాదేశ్‌ల పింక్‌ బాల్‌ టెస్టులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కూతురు సానా గంగూలీల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. భారత జట్టు ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత సౌరవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఒక ఫోటోను షేర్‌ చేశాడు. ఇందుకు కూతరు సానా గంగూలీ.. తండ్రిని ఆట పట్టించే యత్నం చేశారు.  ఆ సీరియస్‌గా ఫోటోను కోడ్‌ చేస్తూ మీరు దేనిని ఇష్టపడటం లేదు అనే కామెంట్‌ పెట్టింది. దీనికి సౌరవ్‌ గంగూలీ ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. ‘ నువ్వు.. నాపై అవిధేయత చూపిస్తున్నావా’.. దానిని అవిధేయత అంటారు’ అంటారు అని గంగూలీ అందుకు బదులిచ్చాడు. మళ్లీ దానికి సానా మరో కామెంట్‌ యాడ్‌ చేశారు. ‘ అది మీ నుంచే నేర్చుకుంటున్నా’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. తండ్రి-కూతుళ్ల మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉండటంతో అది నెటిజన్ల మనసును గెలుచుకుంది.

భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది.  కోహ్లి నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే సమయంలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా టీమిండియా నెలకొల్పింది. మరొకవైపు 360 టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పట్టిష్టం చేసుకుంది.  వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో భారత్‌ పర్యటించనుంది. అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్‌కు అసలైన పరీక్ష ఎదురవడం ఖాయం. న్యూజిలాండ్‌ సైతం బలంగా ఉండటంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top