ఇమ్రాన్‌ తాహీర్‌ నయా రికార్డ్‌..

Imran Tahir First Spinner To Bowl 1st over Of World Cup - Sakshi

లండన్‌: ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2019 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేడు ఆతిథ్య ఇంగ్లండ్‌- దక్షిణాఫ్రికా మధ్య ఓవల్‌ మైదానంలో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ సమరం ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

ఇప్పటివరకు జరిగిన 11 ప్రపంచకప్‌లలో ఎవరికి దక్కని అరుదైన ఘనత అతడికి దక్కింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్రొటీస్‌ జట్టు సారథి డుప్లెసిస్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో తొలి ఓవర్‌ వేసేందుకు తాహీర్‌కు డుప్లెసిస్‌ బంతిని అప్పగించాడు. దీంతో 11 ప్రపంచకప్‌ల నుంచి వస్తున్న ఆనవాయితీని డుప్లెసిస్‌ తెరదించి స్పిన్నర్‌తో తొలి ఓవర్‌ వేయించాడు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ప్రపంచకప్‌‌లోనే తొలిసారి స్పిన్నర్‌తో తొలి ఓవర్‌

1975 తొలి ప్రపంచకప్‌లో టీమిండియా పేస్‌ బౌలర్‌ మదన్‌లాల్‌ తొలి ఓవర్‌ వేసి చరిత్రలో నిలిచిపోగా.. వెస్టిండీస్‌ బౌలర్‌ రాబర్ట్స్‌(1979లో), న్యూజిలాండ్‌ దిగ్గజ బౌలర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ(1983), శ్రీలంక బౌలర్‌ వినోథెన్‌(1987), ఆసీస్‌ బౌలర్‌ డెర్‌మాట్‌(1992), ఇంగ్లండ్‌ బౌలర్లు కార్క్‌(1996), గాఫ్‌(1999),  ప్రొటీస్‌ బౌలర్‌ పొలాక్‌(2003), పాక్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌(2007), 2011లో బంగ్లా బౌలర్‌ ఇస్లాం(2011), లంక బౌలర్‌ కులశేఖర్‌(2015)లు ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేశారు. వీరందరూ పేస్‌ బౌలర్లు కాగా తాజా ప్రపంచకప్‌లో స్పిన్నర్‌ తొలి ఓవర్‌ వేయడం విశేషం.  

ఇక తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టోను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపించి దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభాన్ని అందించాడు. ఇక బెయిర్‌ స్టోతో పాడు ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వికెట్‌ను పడగొట్టాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లోనూ తాహీర్‌ అత్యధిక వికెట్లు(26) పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


చదవండి: 
కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా

పన్నెండో ప్రపంచ యుద్ధం

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top