బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్‌ 

Ian Chappell Speaks About ICC T20 World Cup - Sakshi

మెల్‌బోర్న్‌: షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది టి20 వరల్డ్‌ కప్‌ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అన్నారు. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుందనే నమ్మకం తనకు లేదని చాపెల్‌ పేర్కొన్నారు. బీసీసీఐ తలచుకుంటే ఐసీసీ టోర్నీ స్థానంలో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అక్టోబర్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటే వారికి కచ్చితంగా మార్గం సుగమం అవుతుంది. ఈ విషయంలో బీసీసీఐ గెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వరల్డ్‌ కప్‌ నిర్వహణకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. అసలు లేవని కూడా చెప్పవచ్చు’ అని చాపెల్‌ పేర్కొన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top