ఆ నిబంధన మార్చాలి: ధోని | I would like current playing conditions to change, says Dhoni | Sakshi
Sakshi News home page

ఆ నిబంధన మార్చాలి: ధోని

Mar 27 2015 12:14 PM | Updated on Sep 2 2017 11:28 PM

ఆ నిబంధన మార్చాలి: ధోని

ఆ నిబంధన మార్చాలి: ధోని

వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఐసీసీ ప్రవేశపెట్టిన 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు.

మెల్ బోర్న్: వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రవేశపెట్టిన 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ' ఈ నిబంధన మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రికెట్ చరిత్రలో అంతకుముందెన్నడూ వన్డేల్లో డబుల్ సెంచరీలు మనం చూడలేదు. ఈ మూడేళ్లలోనే మూడు ద్విశతకాలు (వాస్తవానికి ఆరు డబుల్ సెంచరీలు) నమోదమయ్యాయి' అని ధోని పేర్కొన్నాడు.

30- యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్ల కంటే ఎక్కువ మంది ఉండరాదని ఐసీసీ నిబంధన తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనతో డాట్ బాల్స్ వేయాలని అందరూ కోరుతున్నారని ధోని వాపోయాడు. 11 మందిని సర్కిల్ లోపలేవుంచితే మరిన్ని డాట్ బాల్స్ పడతాయంటూ వ్యంగ్యంగా అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement