‘కెప్టెన్‌ కూల్‌’ ట్రేడ్‌ మార్క్‌ కోరుతూ... ఎమ్మెస్‌ ధోని దరఖాస్తు | MS Dhoni trademark application for Captain Cool officially accepted | Sakshi
Sakshi News home page

‘కెప్టెన్‌ కూల్‌’ ట్రేడ్‌ మార్క్‌ కోరుతూ... ఎమ్మెస్‌ ధోని దరఖాస్తు

Jul 1 2025 6:03 AM | Updated on Jul 1 2025 6:03 AM

MS Dhoni trademark application for Captain Cool officially accepted

న్యూఢిల్లీ: మైదానంలో నాయకుడిగా మహేంద్ర సింగ్‌ ధోని సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సారథ్య శైలి, కీలక సమయాల్లోనూ ఒత్తిడిని అధిగమించి  ప్రశాంతంగా ఉంటూ విజయాలు అందించిన తీరు ధోనికి ‘కెప్టెన్‌ కూల్‌’గా గుర్తింపు తెచ్చాయి. జనంలో బాగా ప్రాచుర్యంలోకి వచి్చన ఈ ‘కెప్టెన్‌ కూల్‌’ పదం తనకు మాత్రమే సొంతమని, ఇతరులు ఎవరూ వ్యాపార ప్రయోజనాల కోసం వాడరాదని ధోని చెబుతున్నాడు. అందుకే దీనికి సంబంధించి ట్రేడ్‌ మార్క్‌ హక్కులను కోరుతూ అతను దరఖాస్తు చేశాడు. 

ధోని అప్లికేషన్‌ను ‘ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ ఇండియా’  స్వీకరించింది. ‘క్రీడా శిక్షణ, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు’ అనే కేటగిరీ కింద ఈ దరఖాస్తు దాఖలైంది. నిజానికి 2023 జూన్‌లోనే ధోని ‘కెప్టెన్‌ కూల్‌’ ట్రేడ్‌మార్క్‌ కోసం దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ప్రభ స్కిల్‌ స్పోర్ట్స్‌ అనే కంపెనీ దీని కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. దీనిపై ధోని  అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక గుర్తింపు పొందిన వ్యక్తి పేరును దురుపయోగం చేసే ప్రయత్నం ఇది అంటూ ‘రెక్టిఫికేషన్‌ పిటిషన్‌’ దాఖలు చేశాడు. దీనిపై నాలుగు సార్లు వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడు రెండేళ్లకు అతని దరఖాస్తు ఆమోదం పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement