breaking news
Captain Cool Dhoni
-
‘కెప్టెన్ కూల్’ ట్రేడ్ మార్క్ కోరుతూ... ఎమ్మెస్ ధోని దరఖాస్తు
న్యూఢిల్లీ: మైదానంలో నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోని సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సారథ్య శైలి, కీలక సమయాల్లోనూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటూ విజయాలు అందించిన తీరు ధోనికి ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు తెచ్చాయి. జనంలో బాగా ప్రాచుర్యంలోకి వచి్చన ఈ ‘కెప్టెన్ కూల్’ పదం తనకు మాత్రమే సొంతమని, ఇతరులు ఎవరూ వ్యాపార ప్రయోజనాల కోసం వాడరాదని ధోని చెబుతున్నాడు. అందుకే దీనికి సంబంధించి ట్రేడ్ మార్క్ హక్కులను కోరుతూ అతను దరఖాస్తు చేశాడు. ధోని అప్లికేషన్‌ను ‘ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’ స్వీకరించింది. ‘క్రీడా శిక్షణ, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు’ అనే కేటగిరీ కింద ఈ దరఖాస్తు దాఖలైంది. నిజానికి 2023 జూన్‌లోనే ధోని ‘కెప్టెన్ కూల్’ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ప్రభ స్కిల్ స్పోర్ట్స్ అనే కంపెనీ దీని కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. దీనిపై ధోని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక గుర్తింపు పొందిన వ్యక్తి పేరును దురుపయోగం చేసే ప్రయత్నం ఇది అంటూ ‘రెక్టిఫికేషన్ పిటిషన్’ దాఖలు చేశాడు. దీనిపై నాలుగు సార్లు వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడు రెండేళ్లకు అతని దరఖాస్తు ఆమోదం పొందింది. -
క్యాన్సర్ రోగికి క్రీడాలోకం చేయూత
కోల్‌కతా: కెప్టెన్ కూల్ ధోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవలే గొంతు క్యాన్సర్‌తో మరణించిన అలీప్ చక్రవర్తి, లివర్ క్యాన్సర్‌తో పోరాడుతోన్న బాపి మజ్హి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తన గ్లోవ్స్, ప్యాడ్స్‌ను వేలానికి పెట్టనున్నాడు. ఇక్కడి సెంట్రల్ కోల్‌కతా హోటల్లో జూన్ 11న ఈ వేలం జరుగనుంది. ధోనితో పాటు లియాండర్ పేస్, అజింక్య రహానే, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, మనీశ్ పాండే, బ్రాడ్‌హాగ్, షకీబుల్ హసన్, జులన్ గోస్వామి, ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి, జేజీ తమ జెర్సీలు, బ్యాట్లు, గ్లోవ్స్ లను ఈ వేలంలో ఉంచనున్నారు.