breaking news
Captain Cool
-
‘కెప్టెన్ కూల్’ ట్రేడ్ మార్క్ కోరుతూ... ఎమ్మెస్ ధోని దరఖాస్తు
న్యూఢిల్లీ: మైదానంలో నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోని సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సారథ్య శైలి, కీలక సమయాల్లోనూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటూ విజయాలు అందించిన తీరు ధోనికి ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు తెచ్చాయి. జనంలో బాగా ప్రాచుర్యంలోకి వచి్చన ఈ ‘కెప్టెన్ కూల్’ పదం తనకు మాత్రమే సొంతమని, ఇతరులు ఎవరూ వ్యాపార ప్రయోజనాల కోసం వాడరాదని ధోని చెబుతున్నాడు. అందుకే దీనికి సంబంధించి ట్రేడ్ మార్క్ హక్కులను కోరుతూ అతను దరఖాస్తు చేశాడు. ధోని అప్లికేషన్‌ను ‘ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’ స్వీకరించింది. ‘క్రీడా శిక్షణ, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు’ అనే కేటగిరీ కింద ఈ దరఖాస్తు దాఖలైంది. నిజానికి 2023 జూన్‌లోనే ధోని ‘కెప్టెన్ కూల్’ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ప్రభ స్కిల్ స్పోర్ట్స్ అనే కంపెనీ దీని కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. దీనిపై ధోని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక గుర్తింపు పొందిన వ్యక్తి పేరును దురుపయోగం చేసే ప్రయత్నం ఇది అంటూ ‘రెక్టిఫికేషన్ పిటిషన్’ దాఖలు చేశాడు. దీనిపై నాలుగు సార్లు వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడు రెండేళ్లకు అతని దరఖాస్తు ఆమోదం పొందింది. -
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రైనా..
-
మదినిండా మహేంద్రుడే!
-
ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?
రాంచి: టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్‌గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు. నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.