సెంచరీలు చేసినా హ్యాపీగా ఉండలేను! | I enjoy five-wicket hauls more than my hundreds, says Ashwin | Sakshi
Sakshi News home page

సెంచరీలు చేసినా హ్యాపీగా ఉండలేను!

Aug 23 2016 5:53 PM | Updated on Sep 4 2017 10:33 AM

సెంచరీలు చేసినా హ్యాపీగా ఉండలేను!

సెంచరీలు చేసినా హ్యాపీగా ఉండలేను!

వెస్టిండీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో విశేషంగా రాణించినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు

వెస్టిండీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో విశేషంగా రాణించినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. రెండు టెస్టులు డ్రా కాగా, మరో రెండు టెస్టుల్లో భారత్ నెగ్గి 2-0తో విండీస్ పై సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా తాను ఇలాంటి సిరీస్ లు ఎన్నో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. బౌలింగ్ లో విండీస్ కు చెమటలు పట్టించడంతో పాటు బ్యాటింగ్ లోనూ రాణించి రెండు సెంచరీలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు.


ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు ఉపకరించిందని, భారత అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా రాణించామని తెలిపాడు.  బ్యాటింగ్ లో సెంచరీలతో రాణించడంతో కంటే 5 వికెట్ల ఇన్నింగ్స్ లు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని అశ్విన్ వెల్లడించాడు. సిరీస్ లో రెండు సార్లు 5 వికెట్ల ఇన్నింగ్స్ తో పాటు అశ్విన్ 235 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న భారత క్రికెటర్ గానూ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement