
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను తనపై విధించిన నిషేధాన్ని అప్పీలు చేస్తానంటోంది. తాను ఎలాంటి నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడలేదని తెలిపింది. ‘నేను తప్పు చేయలేదు. ఎలాంటి నిషేధిత ఉత్ప్రే రకాలు తీసుకోలేదు. వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య సాయంతో ఈ నిషేధంపై అప్పీలు చేయాలనుకుంటున్నా’ అని ఆమె శుక్రవారం పేర్కొంది.
గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచిన సంజితపై తాత్కాలిక నిషేధం విధిçస్తున్నట్లు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం టెస్టోస్టిరాన్ వాడినట్లు సమాఖ్య పేర్కొంది. కాగా... గతేడాది నవం బర్‌లో అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా చాను నుంచి శాంపిల్స్ సేకరించారు.