రిత్విక్‌కు డబుల్‌  | Hyderabad's Rithvik wins double Tennis titles | Sakshi
Sakshi News home page

Feb 4 2018 10:27 AM | Updated on Feb 4 2018 10:27 AM

Hyderabad's Rithvik wins double Tennis titles - Sakshi

డబుల్‌ టైటిల్స్‌తో రిత్విక్‌ చౌదరి

సాక్షి, హైదరాబాద్‌ : కెన్యాలో జరిగిన గ్రేడ్‌–4 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ సాధించాడు. సింగిల్స్‌ ఫైనల్లో రిత్విక్‌ 7–5, 6–1తో అబ్దుల్‌ షకూర్‌ (బురుండి)పై గెలుపొందాడు.

అంతకుముందు సెమీస్‌లో 6–1, 6–3తో జ్యాన్‌ అహ్మద్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై; క్వార్టర్స్‌లో 6–4, 6–1తో లూకా అలేసియో అంటునెస్‌ (ఆస్ట్రేలియా)పై విజయాలు సాధించాడు. డబుల్స్‌ ఫైనల్లో రిత్విక్‌–జ్యాన్‌ అహ్మద్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) జోడీ  6–1, 6–2తో నిఖిల్‌ నిరంజన్‌ (అమెరికా)–అమన్‌ పటేల్‌ (భారత్‌) జంటపై గెలుపొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement