త్రోబాల్‌ టోర్నీ విజేత హైదరాబాద్‌ | Hyderabad Wins throw ball Title | Sakshi
Sakshi News home page

త్రోబాల్‌ టోర్నీ విజేత హైదరాబాద్‌

Dec 4 2017 10:43 AM | Updated on Sep 4 2018 5:32 PM

 Hyderabad Wins throw ball Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయి త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లు ఆకట్టుకున్నాయి. కొండాపూర్‌లోని సంస్కృతి స్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో టైటిల్‌ను గెలవడంతో పాటు మహిళల కేటగిరీలో రన్నరప్‌గా నిలిచాయి. ఆదివారం జరిగిన పురుషుల టైటిల్‌ పోరులో హైదరాబాద్‌ 15–11, 15–8తో రంగారెడ్డిపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్‌ 15–11, 15–13తో కరీంనగర్‌పై గెలుపొందింది.

మహిళల తుదిపోరులో ఖమ్మం 15–12, 16–14, 15–12తో హైదరాబాద్‌పై నెగ్గింది. రంగారెడ్డి జట్టు 15–11, 15–13తో కరీంనగర్‌ను ఓడించి మూడోస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సంస్కృతి స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌. రేవతి రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ త్రోబాల్‌ సంఘం కార్యదర్శి పి. జగన్‌ మోహన్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement