హైదరాబాద్‌ జట్ల జోరు | hyderabad teams won opener of tug of war championship matches | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జట్ల జోరు

Sep 23 2017 11:39 AM | Updated on Sep 4 2018 5:07 PM

hyderabad teams won opener of tug of war championship matches - Sakshi

అంతర్‌ జిల్లా సీనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లు శుభారంభం చేశాయి.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లు శుభారంభం చేశాయి. కూకట్‌పల్లిలోని రమ్య ప్లేగ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. మహిళల విభాగంలో హైదరాబాద్‌ 2–1తో ఆదిలాబాద్‌పై గెలుపొందగా, పురుషుల విభాగం తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3–0తో  నల్లగొండపై, రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3–0తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించాయి. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో కరీంనగర్‌పై, నిజామాబాద్‌ 3–0తో ఆదిలాబాద్‌పై, వరంగల్‌ 3–0తో ఖమ్మంపై, మెదక్‌ 3–0తో నల్లగొండపై, ఆదిలాబాద్‌ 3–0తో వరంగల్‌పై, నిజామాబాద్‌ 3–0తో ఖమ్మంపై, రంగారెడ్డి 3–0తో ఖమ్మంపై నెగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement