
పంజాబ్ టార్గెట్ 186
ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు సాధించింది.
హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు సాధించింది.
52 బంతుల్లో 81 పరుగులు చేసిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. టోర్నీలో అత్యధిక పరుగులు (504) సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. శిఖర్ దావన్ (24), హెన్రిక్స్ (28) పరుగులతో రాణించారు. ఏడు బంతులు ఎదుర్కొన్న మోర్గాన్.. 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లలో రాహుల్ (17), కరణ్ శర్మ (11) తెలివిగా పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో హెండ్రిక్స్ రెండు, మాక్స్వెల్, గుర్కీరత్ లకు చెరో వికెట్ దక్కింది.