మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ జట్టుకు తొలి ..
ముంబైతో రంజీ క్వార్టర్ ఫైనల్
రాయ్‌పూర్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించే అవకాశం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 167/3తో మూడో రోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్ 280 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (82; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొల్లా సుమంత్ (44; 5 ఫోర్లు), మెహదీ హసన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్స్) ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడం ఖాయమనిపించింది.
అయితే హసన్ అవుటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. హైదరాబాద్ చివరి ఐదు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 102 పరుగులు చేసింది.
ఇతర క్వార్టర్ ఫైనల్ స్కోర్లు
lగుజరాత్ తొలి ఇన్నింగ్స్: 263; ఒడిశా తొలి ఇన్నింగ్స్: 199; గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 246/3 (సమిత్ 110 బ్యాటింగ్, ప్రియాంక్ 81).
lహరియాణా తొలి ఇన్నింగ్స్: 258; జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 345; హరియాణా రెండో ఇన్నింగ్స్: 146/2.