హైదరాబాద్ బౌలర్లు విఫలం | hyderabad bowlers failed in under 19 cricket | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బౌలర్లు విఫలం

Nov 8 2016 10:48 AM | Updated on Sep 4 2018 5:24 PM

కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు.

కూచ్ బెహర్ క్రికెట్ టోర్నమెంట్


సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. రోజంతా ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టారు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 116 ఓవర్లలో 3 వికెట్లకు 457 పరుగులు చేసింది. మూడోరోజు ఆటలో కెవిన్ (314 బంతుల్లో 217; 39 ఫోర్లు, 1 సిక్సర్) డబుల్‌సెంచరీతో హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఏకంగా 39 బౌండరీలతో చెలరేగాడు. నిఖత్‌జోషి (84) అర్ధసెంచరీ చేశాడు. సచిన్ (28 బ్యాటింగ్), జడేజా (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

 

హైదరాబాద్ బౌలర్లలో ప్రసాద్, వినీత్‌రెడ్డి, రిషబ్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్‌‌సలో 19 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement