ఆధిక్యంలో హంపి | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో హంపి

Published Sun, Sep 22 2013 1:18 AM

Humpy Koneru in lead grand pre chess tournment

తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆధిక్యంలో కొనసాగుతోంది. కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హంపి 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
 
 ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. జూ వెన్‌జున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. నాలుగో రౌండ్ తర్వాత హంపి మూడున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... మూడు పాయింట్లతో హారిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం విశ్రాంతి దినం. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ ఈనెల 30న ముగుస్తుంది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement