అమెరికా చేతిలో భారత్‌ ఓటమి | Hockey World League Semi-Final: Indian women's team aims for win | Sakshi
Sakshi News home page

అమెరికా చేతిలో భారత్‌ ఓటమి

Jul 11 2017 12:31 AM | Updated on Sep 5 2017 3:42 PM

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నీలో భారత్‌ తొలి పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకున్న భారత్‌.

జొహన్నెస్‌బర్గ్‌: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నీలో భారత్‌ తొలి పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకున్న భారత్‌... సోమవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో 1–4 గోల్స్‌ తేడాతో అమెరికా చేతిలో పరాజయం పాలైంది. భారత్‌కు 38వ నిమిషంలో లిలిమా మింజ్‌ ఏకైక గోల్‌ను అందించింది. తొలి క్వార్టర్‌లో భారత్‌ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరచడంతో అమెరికా గోల్‌ చేయలేకపోయినా ఆ తర్వాత విజృంభించింది. భారత్‌కు దక్కిన రెండు పెనాల్టీ కార్నర్‌లు వృథా అయ్యాయి. అమెరికా తరఫున జిల్‌ విట్మర్‌ (24వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... వెస్ట్‌ టేలర్‌ (40వ నిమిషంలో), మిచెల్లి (49వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 12న చిలీతో ఆడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement