హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్ | Hingis' High Five to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్

Nov 29 2015 12:07 AM | Updated on Sep 3 2017 1:10 PM

హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్

హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్

చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్ టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు నేటి నుంచి హైదరాబాద్ వేదిక కానుంది.

 ఏసెస్ తరఫున బరిలో హింగిస్
 సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్ టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు నేటి నుంచి హైదరాబాద్ వేదిక కానుంది. లాల్‌బహదూర్ స్టేడియంలో ఆది, సోమవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో నాగ్‌పూర్ ఆరెంజర్స్‌తో తలపడే హైదరాబాద్ ఏసెస్... మరుసటి రోజు చెన్నై వారియర్స్‌ను ఎదుర్కొంటుంది. హైదరాబాదీ సానియా మీర్జా భాగస్వామి, ప్రపంచ డబుల్స్ రెండో ర్యాంకర్ అయిన మార్టినా హింగిస్ ఈ ఏడాది కూడా ఏసెస్ జట్టు తరఫునే బరిలోకి దిగుతుండటం విశేషం.

ఆమెతో పాటు థామస్ జాన్సన్, ఇవో కార్లోవిచ్, జీవన్ నెడుంజెళియన్, ఆదిల్ కళ్యాణ్‌పూర్, సామ సాత్విక ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఒక ‘టై’గా పరిగణిస్తారు. ఈ ‘టై’లో ఐదు సెట్‌లు ఉంటాయి. ఈ ఐదు సెట్‌లు వరుసగా లెజెండ్స్ సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో సెట్‌లో ఐదు గేమ్‌లే ఆడతారు. ఐదు సెట్‌లు కలిపి ఎక్కువ గేమ్‌లు గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా చెన్నైతో జరిగి తొలి ‘టై’లో హైదరాబాద్ విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement