‘అందుకే రషీద్‌ ఖాన్‌ విఫలం’

Hayden explains failure of Rashid Khan in Bengaluru Test - Sakshi

బెంగళూరు: ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో విఫలం కావడంపై ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ స్పందించాడు. అసలు రషీద్‌ ఎందుకు వైఫల్యం చెందాడో అనే దానిపై విశ్లేషించాడు.

‘టెస్టు క్రికెట్‌ అనేది లాంగెస్ట్‌ పార్మాట్‌. ఈ ఫార్మాట్‌లో ముందుగా పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. సాంప్రదాయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడానికి చాలా ఓర్పు కావాలి.  ఇక్కడ మొదటి రోజు నుంచి బౌలింగ్‌తో ఎటాక్‌ చేయడం సరికాదు. ఎప్పుడైతే బంతిని రషీద్‌ అందుకున్నాడో ఆ క్షణమే దూకుడుగా బౌలింగ్‌ చేసే ప‍్రయత్నం చేశాడు. అందులోనూ రషీద్‌కు తొలి టెస్టు పిచ్‌. అటువంటప్పుడు సాంప్రదాయరీతిలో బౌలింగ్‌ను ఆరంభిస్తే బాగుండేది. దూకుడుతో కూడిన బౌలింగ్‌ వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నాడు’ అని మాథ్యూ హేడెన్‌ పేర్కొన్నాడు.

రషీద్‌ ఖాన్‌ చెత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top