దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా | Hashim Amla Test captain as south africa team | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా

Jun 4 2014 1:23 AM | Updated on Sep 2 2017 8:16 AM

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా

సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గ్రేమ్ స్మిత్ గత మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతని స్థానంలో ఆమ్లాను నియమించారు.

జొహన్నెస్‌బర్గ్: సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గ్రేమ్ స్మిత్ గత మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతని స్థానంలో ఆమ్లాను నియమించారు.
 
  భారత సంతతికి చెందిన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఆమ్లా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. దక్షిణాఫ్రికాకు ఓ బీర్ బ్రాండ్ స్పాన్సర్‌గా ఉండటంతో.. ఆ లోగో ఉన్న డ్రెస్సును, కిట్‌ను వాడేందుకు ఇష్టపడటం లేదని, అందుకే కెప్టెన్సీ వద్దంటున్నాడని అయితే ఆమ్లా తన డ్రెస్సుతో పాటు కిట్‌పైనా బీర్ బ్రాండ్ లోగో ఉపయోగించకుండా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement