
ముంబై: వెస్టిండీస్ పర‍్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో సభ్యుడైన హార్దిక్.. తన ప్రాక్టీస్‌ను ముందుగానే మొదలు పెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తగినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండాలని భావించిన హార్దిక్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన హార్దిక్ భారీ షాట్లుపైనే గురిపెట్టాడు. ప్రధానంగా ఎంఎస్ ధోని ట్రేడ్‌మార్క్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను హార్దిక్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. ప్రతీ బంతిని హిట్ చేస్తూ తన బ్యాటింగ్ పవర్‌ను పరీక్షించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
న్యూజిలాండ్ జరిగిన వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన హార్దిక్.. విండీస్ పర్యటనకు దూరమయ్యాడు. అతనికి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో దాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. ఇక మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టే సమయం ఆసన్నం కావడంతో మరోసారి బ్యాట్ పట్టాటు హార్దిక్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లినే టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ షైనీలకు మరోసారి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఈ సిరీస్ నుంచి ఎంఎస్ ధోని స్వతహాగానే తప్పుకోవడంతో రిషభ్ పంత్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
Solid session in the nets today 💥 Can’t wait to join up with the boys 🇮🇳 pic.twitter.com/ghpNf306kO
— hardik pandya (@hardikpandya7) September 6, 2019